Dasara Holidays | హైదరాబాద్ : వినాయక చవితి నవరాత్రులు ముగిశాయి. ఇక త్వరలో వచ్చే పండుగ బతుకమ్మ( Bathukamma ), దసరా ఉత్సవాలు( Dasara Festival ). అయితే తెలంగాణలో దసరా పండుగ సెలవులు అక్టోబర్ 2 నుంచి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అంటే 13 రోజుల పాటు దసరా సెలవులను నిర్ణయించారు. బతుకమ్మ వేడుకలు అక్టోబర్ 2వ తేదీన ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 15వ తేదీన తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
ఇక క్రిస్మస్( Christamas ) వేడుకలకు డిసెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఇవ్వనున్నారు. సంక్రాంతి( Sankranthi ) సెలవులు జనవరి 13 నుంచి 17 వరకు ప్రకటించారు. అంటే ఐదు రోజులు సంక్రాంతి సెలవులు ఇచ్చారు.