విధాత ప్రత్యేక ప్రతినిధి: మహిళలు ఏడాది పొడువునా ఎదురుచూసే బతుకమ్మ పండుగను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఒక్కేసి పూలేసి చందమామ ఒక్కజాము అయే చందమామ అంటూ మహిళలు తమకు అత్యంత ఇష్టమైన పూల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ ఆడే స్థలాలకు సాయంత్రం నుంచే మహిళలు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను చేతబట్టుకుని గుంపులు గుంపులుగా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సంబురం అంబరాన్ని తాకాయి. చెరువు కట్ట ప్రాంతాలు, మైదానాలు, గుడులు, గోపురాల స్థలాలు బతుకమ్మ ఆటాపాటాలతో హోరెత్తాయి. డప్పుల చప్పుల్లు, డీజే మోతలతో బతుకమ్మ శోభతో తెలంగాణ కొత్త రంగులు సంతరించుకున్నది. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం ముఖ్యంగా స్థానిక కార్పొరేషన్లు, గ్రామపంచాయతీలు, నగరపాలక సంస్థలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో గుడులు, మైదానాలు, ఆటస్థలాలు, బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో అలంకరించారు. పరిసర ప్రాంతాలను ముస్తాబు చేశారు. మహిళలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా మైదనాలను చదునుచేసి, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.
వేయిస్తంభాలగుడిలో ఎంగిలిపూల బతుకమ్మ
హనుమకొండలోని వేయి స్థంభాల దేవాయాల ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ట్రైసిటి పరిధిలోని మహిళలు బతుకమ్మలతో సీతాకోక చిలుకల్లా వాలిపోయారు. గుడి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆటాపాటలు, కోలాటయం, ఊయల పాటలతో పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. తెలంగాణ అంతటా బతుకమ్మ సంబురాలు ఆకాశాన్ని తాకాయి. మహిళలు సంతోషంతో ఉప్పొంగిపోయారు. గత వారం రోజుల నుంచి బతుకమ్మ కోసం పడుతున్న శ్రమను ఆదివారం రంగురంగుల పూలతో అలంకరించి తమ ఆకాంక్షనుల చాటిచెప్పారు. భక్తితో గౌరవమ్మను కొలిచేందుకు ప్రాధాన్యతనిచ్చారు. ఎక్కడ చూసినా రంగురంగుల బతుకమ్మలు దర్శనమిచ్చాయి. సాయంత్రం వేళలో కొత్త బట్టలతో యువతులు, మహిళలు, చిన్నారులు వయోభేదం లేకుండా బతుకమ్మ ఆటస్థలాలకు గుంపులు గుంపులుగా చేరుకున్నారు.
రాష్ట్ర సుభిక్షంగా ఉండాలి: భట్టి
అమ్మ వారి దివేనలతో రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం వేయిస్తంభాల దేవాలయంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు జూపెల్లి, పొంగులేటి, కొండా, సీతక్క తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ మహిళలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ పండుగా శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు అమ్మ వారి స్వరూపంగా మరింత ఆర్థికంగా ఎదగాలని ఆకాక్షించారు. మంత్రులు మాట్లాడుతూ చారిత్రాత్మక వేయిస్తంభాల బతుకమ్మ వేడుకలను నిర్వహించుకొవడం అద్భుతమైన సన్నివేశంగా పేర్కొన్నారు. ఈ పండుగ ప్రకృతితో మైమేకం అయిన పండుగ అంటూ అభివర్ణించారు. ఇది అంతర్జాతీయ స్థాయికి విస్తరించాయని, దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాటలు కుడా బతుకు తీరును చూపిస్థాయన్నారు. ఈ పండుగకు ఒక చరిత్ర ఉందన్నారు. పసుపుతో తయారు చేసిన గౌరమ్మ చెరువులో నిమజ్జనం చేయడంతో చెరువు శుద్ధీ అవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పండుగ సందర్భంగా అన్ని చోట్ల విస్తృత ఏర్పాట్లు చేశారు.