హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విధాత): బతుకమ్మ పండగ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని పలు కాలనీల్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మహిళలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పండగ సందర్భంగా ప్రజలందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నానన్నారు. హుస్నాబాద్‌లో ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుక్మ వరకు తొమ్మిది రోజుల పాటు జరిగే పండగకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.