Site icon vidhaatha

ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగింది: చీఫ్ విప్ దాస్యం


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోందని, వారి బతుకుల్లో వెలుగు నింపేందుకే ఈ పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మ్యానిఫెస్టోను గడప గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందన్నారు. తొమ్మిదేళ్లుగా అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని, అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని అమలు చేస్తూ అన్ని వర్గాల కోసం అహర్నిశలు కష్టపడుతున్న నాయకుడు కేసీఆర్ అన్నారు.


ఓట్ల కోసం వచ్చేవి ప్రతిపక్షాలు


ఎన్నికల సమయంలో మాత్రమే ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పైన అనేక విమర్శలు చేస్తున్నారని వినయ్ అన్నారు. ప్రజలు ఎన్నికల్లో మాత్రమే కనబడే వ్యక్తిని గుర్తించరని తెలిపారు. పని చేసే నాయకుడినే ఎన్నుకుంటారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, నాయకులు శివ శంకర్, ఈగ మల్లేశం, కేశవరెడ్డి, సంపత్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, సోనీ, రవీందర్ పాల్గొన్నారు.

Exit mobile version