Site icon vidhaatha

TELANGANA ASSEMBLY | సిరాజ్‌..నిఖత్‌లకు గ్రూప్ 1 ఉద్యోగాలు : డిప్యూటీ సీఎం భట్టి

విధాత, హైదరాబాద్ : టీమ్ ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీను గ్రూప్-1 ఉద్యోగాలు ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు శాసనసభలో ఆయన ప్రకటన చేశారు. అనంతరం క్రీడా రంగానికి సంబంధించిన పలు సవరణ బిల్లులను సభలో భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. వీటికి మద్దతు తెలపాలని ప్రతిపక్షాలను ఆయన కోరారు. తెలంగాణకు పేరు తెచ్చిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. క్రీడారంగం సవరణ బిల్లుపై సీఎం రేవంత్‌రెడ్డి, సహా అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. క్రికెట్ సహా ఇతర క్రీడలన్నింటిని ప్రొత్సహించేలా, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేలా మంచి స్టేడియాలు మండల స్థాయిలో, పట్టణాల్లో నిర్మించాలని కోరారు.

Exit mobile version