Lightning | వానా కాలం జ‌ర జాగ్ర‌త్త‌.. పిడుగుపాటు నుంచి తప్పించుకోండిలా..!

Lightning | వానా కాలం ప్రారంభ‌మైంది. దేశ వ్యాప్తంగా కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇక వ‌ర్షానికి ముందు, వ‌ర్షం కురుస్తోన్న స‌మ‌యంలో ఉరుములు, మెరుపులు మెరుస్తున్నాయి. ఉరుములు, మెరుపులు వ‌చ్చే స‌మ‌యంలో ప‌డే పిడుగుల కార‌ణంగా ప్ర‌తి ఏడాది కొన్ని వేల మంది చ‌నిపోతున్నారు. ఇలా చ‌నిపోతున్న వారిలో అధికంగా రైతులు, మ‌హిళా కూలీలు, ప‌శువుల కాప‌రులే ఉంటున్నారు. అయితే ఉరుములు.. మెరుపులు వ‌చ్చే స‌మ‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే పిడుగుపాటు నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

  • Publish Date - June 28, 2024 / 09:43 PM IST

అస‌లు పిడుగు అంటే ఏమిటి..?

మేఘాల వ‌ద్ద ఉష్ణోగ్ర‌త‌లు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల వాటి ఆవిరి చిన్న చిన్న నీటి బిందువుల రూపంలో ఉంటుంది. ఇదే స‌మ‌యంలో విప‌రీత‌మైన గాలులు వీచిన‌ప్పుడు ఆ మంచు క‌ణాలు, నీటి బిందువుల మ‌ధ్య రాపిడి జ‌రిగి ఎల‌క్ట్రిక‌ల్ ఛార్జి ఉత్ప‌న్న‌మ‌వుతుంది. దీంతో పాజిటివ్, నెగిటివ్ ఛార్జి ఉన్న క‌ణాలు విడుద‌ల‌వుతాయి. వీటిలో పాజిటివ్ ఛార్జి క‌ణాలు తేలికగా ఉండ‌డం వ‌ల్ల అవి మేఘంలోని పై భాగానికి, అలానే నెగెటివ్ క‌ణాలు బ‌రువుగా ఉండడం మూలంగా అవి కింది భాగానికి చేరుకుంటాయి. అయ‌స్కాంతంలోని ఉత్త‌ర – ద‌క్షిణ ధృవాల మాదిరి ఆక‌ర్షించుకుంటాయి. నెగెటివ్, పాజిటివ్ క‌ణాల మ‌ధ్య రాపిడి జ‌రిగి రెండింటి మ‌ధ్య మెరుపు(విద్యుత్), ఉరుము(శ‌బ్దం) ఉత్ప‌న్న‌మ‌వుతాయి. ఈ మెరుపు భూమిని చేరే క్ర‌మంలో విద్యుత్ ప్ర‌స‌రిస్తుంది. భారీ శ‌బ్దంతో నెగెటివ్ క‌ణాలు భూమిని చేరే ప్ర‌క్రియ‌నే పిడుగు అని పిలుస్తారు.

తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే..

1. ఉరుములు, మెరుపుల స‌మ‌యంలో బ‌య‌ట ఉంటే షెల్ట‌ర్ వెతుక్కోవాలి. చెట్ల కింద‌కు అస‌లు వెళ్లొద్దు. ఎందుకంటే చెట్లు, క‌రెంట్ స్తంభాలు పిడుగుల‌ను సులువుగా ఆక‌ర్షిస్తాయి. చెట్ల‌పైనే అధికంగా పిడుగులు ప‌డుతుంటాయి.. దీన్ని మ‌నం గ‌మ‌నిస్తూనే ఉంటాం.

2. పిడుగులు ప‌డే స‌మ‌యంలో వ‌ర్షంలో త‌డిసినా ప‌ర‌వాలేదు. కానీ గొడుగు అస‌లు ఉప‌యోగించ‌కూడ‌దు. ద‌గ్గ‌ర‌లో కారు ఉంటే అందులో కూర్చోండి.

3. ఇక ఎక్క‌డా షెల్ట‌ర్ దొర‌క్కుంటే ఎత్తు త‌క్కువ‌గా ఉండే ప్ర‌దేశాల్లో కూర్చుని త‌ల కింద‌కు వంచి, చెవులు, క‌ళ్లు మూసుకుని కూర్చోవాలి.

4. పిల్ల‌ల‌ను, పెంపుడు జంతువుల‌ను ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రానివ్వ‌కూడ‌దు.

5. ఇక ఇంటి త‌లుపులు, కిటీకీల వ‌ద్ద నిల్చోవ‌ద్దు.

6. ఉరుములు, మెరుపుల స‌మ‌యంలో ట్యాప్ కింద చేతులు. గిన్నెలు క‌డ‌గ‌కూడ‌దు. ష‌వ‌ర్ కింద స్నానం కూడా చేయ‌కూడ‌దు.

7. ఉరుములు ఉరిమిన‌ప్పుడు, మెరుపులు మెరిసిన‌ప్పుడు ఫోన్‌లో అస‌లు మాట్లాడ‌కూడ‌దు. ఎఫ్ఎం రేడియో కూడా విన‌కూడ‌దు. టీవీ చూడ‌కూడ‌దు. స్విచ్ బోర్డుల నుంచి ప్ల‌గ్‌లు తీసేయాలి.

8. ఉరుములు, మెరుపుల స‌మ‌యంలో మ‌న శ‌రీరం జ‌ల‌ద‌రింపుల‌కు గురికావ‌డం, వెంట్రుక‌లు నిక్క‌బొడుచుకోవ‌డం లాంటి సంకేతాలు పిడుగులు ప‌డే స‌మ‌యంలో క‌నిపిస్తాయి. ఇలా జ‌రిగితే పిడుగు మీ ద‌గ్గ‌ర్లో ప‌డుతున్న‌ట్లు అర్థం. కాబ‌ట్టి మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండి పై సూచ‌న‌లు పాటించాలి.

Latest News