DRI Seizures Ganja At Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.12కోట్ల విదేశీ గంజాయి పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.12కోట్ల విలువైన 12కిలోల విదేశీ గంజాయి స్వాధీనం.. ప్రయాణికుడు అదుపులో!

high-grade ganja were seized

విధాత, హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.12కోట్ల విలువైన 12కిలోల విదేశీ గంజాయిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి వద్ధ సోదాల్లో విదేశీ గంజాయి లభ్యమైంది. పట్టుబడిన గంజాయిని సీజ్ చేసిన అధికారులు..ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈనెల 10న బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన సయ్యద్ రిజ్వీ అనే వ్యక్తి లగేజ్ లో రూ.14కోట్ల విలువైన 13.9 కిలోల గంజాయి లభ్యమైంది. ఆగస్టు 12న కూడా బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద నుంచి రూ.13.3 కోట్లు విలువైన హైడ్రోఫోనిక్‌ గంజాయిని శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. జూలై 30న కూడా బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద రూ.40 కోట్లు విలువ చేసే హైడ్రోఫోనిక్‌ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక రోజు క్రితం కువైట్ నుండి వచ్చిన ప్రయాణికుల నుండి రూ. 3.36 కోట్ల విలువైన 3.38 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్, అక్రమ బంగారం పట్టుబడుతున్నప్పటికి వాటి అక్రమ రవాణా ఆగకపోవడం గమనార్హం.