India’s largest Airport | డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్( Domestic Aviation Market )లో ప్రపంచంలోనే అతిపెద్ద మూడో దేశం మన ఇండియా( India ). భారత్‌లో మొత్తం 487 ఎయిర్‌పోర్టులు, ఎయిర్‌స్ట్రిప్‌లు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. మరి ఇన్ని ఎయిర్‌పోర్టులో ఉన్న ఇండియాలో అతిపెద్ద ఎయిర్‌పోర్టు మన హైదరాబాద్( Hyderabad ) నగరంలోనే ఉంది. దానికి మనందరం గర్వపడాల్సిన అవసరం కూడా ఉంది.
దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా అవతరించిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు( RGIA )ను హైదరాబాద్ ఎయిర్‌పోర్టు లేదా శంషాబాద్ ఎయిర్‌పోర్టు( Shamshabad Airport ) అని పిలుస్తుంటారు. ఈ విమానాశ్రయం మొత్తం 5,500 ఎకరాల్లో విస్తరించి ఉంది. 4,260 కిలోమీటర్ల మేర రన్‌వేను కలిగి ఉంది. ఎయిర్‌బస్ ఏ380 ల్యాండ్ అయ్యే సామర్థ్యం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సొంతమని చెప్పొచ్చు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఏడాదికి 34 మిలియన్ల మంది ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది. 2022-23 ఏడాదిలో ఈ ఎయిర్‌పోర్టు మీదుగా 2.10 కోట్ల మంది ప్రయాణించినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఈ-బోర్డింగ్ సౌకర్యం కూడా కలదు. 83 పార్కింగ్ బేస్ ఉన్నాయి. 10 ఏరో బ్రిడ్జిలు, 46 ఇమ్మిగ్రేషన్ కౌంటర్స్, 96 చెక్ ఇన్ కౌంటర్స్ ఉన్నాయి. ప్రయాణికులకు ఉచిత వైఫై సదుపాయం, బేబీ కేర్ రూమ్, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్, ఫార్మసీ సౌకర్యం, లగేజీ స్టోరేజీ ఫెసిలిటీస్, షాపింగ్ కాంప్లెక్స్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద పది ఎయిర్‌పోర్టుల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు 8వ స్థానంలో నిలిచింది.