హైద్రాబాద్ నగరంలో తొలిసారిగా బ్రౌన్ షుగర్ డ్రగ్స్‌ను టాస్క్ పోర్సు పోలీసులు పట్టుకున్నారు. పంజాబ్ నుంచి హైద్రాబాద్‌కు డ్రగ్స్ తీసుకవచ్చిన విక్రయిస్తున్న లవ్లీ యూనివర్సిటీ విద్యార్థులు సూరీలీల, వీరసాయి తేజలను పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీ హిల్స్‌లో రోడ్ నెంబర్ 36వద్ద 100గ్రాముల ఎండీఎంఏ, 26గ్రాముల కొకైన్, 29ప్యాకెట్ల ప్రమాదకర బ్రౌన్ షుగర్ డ్రగ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
లోన్ యాప్‌లలో విచ్చలవిడిగా అప్పులు చేసి జల్సాలకు అలవాటు పడిన నవీన్ గత నాలుగేళ్లుగా పంజాబ్ నుంచి హైద్రాబాద్‌కు డ్రగ్స్ తీసుకవచ్చి విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నవీన్ ఇప్పటిదాకా నాలుగేళ్లుగా ఎంతమందికి నగరంలో డ్రగ్స్ అమ్మారు..నవీన్ వెనుక ఉన్న డ్రగ్ ముఠాలు ఎక్కడివన్న వివరాలపై దర్యాప్తు సాగిస్తున్నారు.
జూబ్లీహిల్స్‌లోని పబ్‌లలో ఈ డ్రగ్‌ను రెగ్యులర్ కస్టమర్ల కోసం తెచ్చివుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నవీన్ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని డాటా ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే నవీన్ ఎప్పటికప్పుడు వాట్సాప్ చాట్ డిలీట్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
మరోవైపు రాచకొండ పరిధిలో మరోసారి డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా విక్రయించేందుకు అక్రమంగా తీసుకొచ్చిన డ్రగ్స్ హైద్రాబాద్ పోలీసులకు చిక్కాయి. రాజస్థాన్ నుంచి హైద్రాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చిన ముఠా పలువురికి డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. 15 గ్రామాల హెరాయిన్‌ను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. విచారణ కొనసాగిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హైద్రాబాద్ సిటీని డ్రగ్స్ రహిత నగరంగా మార్చాలని పోలీస్ శాఖను ఆదేశించడంతో డ్రగ్స్ సరఫరా, విక్రయాలు, వినియోగంపై పోలీస్ శాఖ గట్టి నిఘా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రగ్స్ వినియోగానికి అవకాశముండటంతో నిఘా బృందాలు వేడుకలపై ప్రత్యేక దృష్టిని సారించాయి.