Site icon vidhaatha

రైతు భరోసా నిధులకు ఈసీ బ్రేక్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కారుకు ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. రైతు భరోసా నిధుల విడుదలపై ఆంక్షలు విధించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాతే రైతులకు నిధులు విడుదల చేయాలని తేల్చి చెప్పింది. రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల కమిషన్‌కు ఎన్‌ వేణుకుమార్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రైతు భరోసా చెల్లింపులపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను సైతం ఆయన కమిషన్‌కు తెలిపారు. ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్‌ సీఎం రేవంత్‌ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది.

రైతు భరోసా నిధుల విడుదలపై ఆంక్షలు విధించింది. ఇప్పటికే ఐదు ఎకరాలు పైబడిన వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. ఐదెకరాలలోపు ఉన్న రైతులకు ఇప్పటికే నిధులు విడుదలవగా.. ఐదెకరాలుపైబడిన వారికి చెల్లింపులు ప్రారంభించింది. ఇటీవల ఎన్నికల బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మే 9వ తేదీలోగా రైతులందరికీ రైతుభరోసా నిధులు విడుదల చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.

Exit mobile version