సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయాలకు చెందిన 100 ఎకరాల భూములను హైకోర్టుకు

  • Publish Date - January 11, 2024 / 12:16 PM IST

విధాత : రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయాలకు చెందిన 100 ఎకరాల భూములను హైకోర్టుకు కేటాయించడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ దిష్టిబొమ్మని దహనం చేసిన ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు దహనం చేసి నిరసన తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన వన యూనివర్సిటీల భూములను అసంబద్దంగా హైకోర్టుకు కేటాయించడంతో పాటు బదులుగా వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సిటీలకు భూములు కేటాయించకపోవడాన్ని ఏబీవీపీ నాయకులు తప్పుబట్టారు.

మరోవైపు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయాల భూములను హైకోర్టుకు కేటాయించాన్ని నిరసిస్తూ నిర్మాణానికి కేటాయించడం పట్ల ఆ యూనివర్సిటీల పరిధిలోని విద్యార్థులు చేపట్టిన నిరసనలను గురువారం కూడా కొనసాగించారు.