విధాత: అసెంబ్లీ ఎదురుగా ఉన్న నిజాం క్లబ్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది .కాగా ఈ మంటల దాడికి క్లబ్‌లోని రెండవ అంతస్తులో ఉన్న ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమైందని సమాచారం.ఇక ఈ ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్దలానికి చేరుకుని రెండు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారట.కాగా ప్రమాదం చోటు చేసుకున్న సమయం లో క్లబ్‌లో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు అధికారులు.
ఇక ఈ ప్రమాదం జరగడానికి కారణాలు మాత్రం తెలియలేదు