KCR|| అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు.. వచ్చేది మన ప్రభుత్వమే

గత పదేండ్ల BRS పాలనలో నూతన తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెంది స్వయం పాలిత కేంద్రాలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. గజ్వేల్ నియోజక వర్గ పరిధిలోని, ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు.. వార్డు మెంబర్లు శుక్రవారం కేసీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. వారిని తన నివాసానికి సాదరంగా ఆహ్వానించి, గ్రామస్థుల సమష్టి మద్దతుతో ఎన్నికైన సర్పంచులను కేసీఆర్ శాలువాతో సత్కరించి, మిఠాయిలు పంచారు.

విధాత: గత పదేండ్ల BRS పాలనలో నూతన తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెంది స్వయం పాలిత కేంద్రాలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. గజ్వేల్ నియోజక వర్గ పరిధిలోని, ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు.. వార్డు మెంబర్లు శుక్రవారం కేసీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. వారిని తన నివాసానికి సాదరంగా ఆహ్వానించి, గ్రామస్థుల సమష్టి మద్దతుతో ఎన్నికైన సర్పంచులను కేసీఆర్ శాలువాతో సత్కరించి, మిఠాయిలు పంచారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. “మనకు అన్ని కాలాలు అనుకూలంగా వుండయి. కొన్నికొన్ని సమయాలు కష్టాలు వస్తయి. వాటికి వెరవకూడదు. మల్లా మన ప్రభుత్వమే వస్తది. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచిరోజులు వస్తయి. అప్పడిదాకా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అధైర్య పడొద్దు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో స్వయంశక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలె” అని కేసీఆర్ గ్రామస్థులకు వివరించారు.

“ఇప్పుడు నూతనంగా ఎన్నికైతున్న సర్పంచులు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రచించుకోవాలి. గంగదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకొని, ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసుకొని, మన పని మనం చేసుకుంటూ మన పల్లె అభివృద్ధికి పాటుపడాలి. ఎవరో ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దు” అని కేసీఆర్ తెలిపారు.

Read Also: 22a List Controversy | తెలంగాణ రైతులకు సర్కార్‌ షాక్‌! కోటి ఎకరాల భూములపై లావాదేవీలు బంద్‌!
Revanth Reddy : ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతైనా ఖర్చు పెడుతాం

Latest News