విధాత: బీఆరెస్ అధినేత కె చంద్రశేఖర్ రావును రాష్ట్ర మాజీ గవర్నర్ ఇ ఎస్ ల్ నరసింహన్ పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం నందినగర్ చేరుకున్న గవర్నర్ దంపతులు కేసీఆర్ తో మర్యాద పూర్వక భేటీ అయ్యారు. కేసీఆర్ గారి ఆరోగ్యపరిస్థితి వివరాలు తెలుసుకున్నారు. త్వరలో పూర్తిస్థాయి లో కోలుకోవాలని ఆకాంక్షించారు. కాసేపు కేసీఆర్ సతీమణి శోభమ్మ తదితర కుటుంబ సభ్యులతో వారు ఇష్టాగోష్టి జరిపారు. నందినగర్ నివాసానికి చేరుకున్న నరసింహన్ దంపతులను తొలుత బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. నరసింహన్ దంపతులను ఆహ్వానించిన వారిలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, బీబీ పాటిల్ తదితరులున్నారు.