మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హౌస్ అరెస్ట్

  • Publish Date - October 14, 2023 / 10:27 AM IST

విధాత : సడక్ బంద్‌కు వెళ్లడానికి సిద్ధమవుతున్న ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ ను పోలీసులు శాంతినగర్ లోని తన నివాసంలో గృహ నిర్బంధం చేసి హౌస్ అరెస్టు చేశారు.


అధికార బీఆరెస్‌ ప్రభుత్వం పోటీ పరీక్షల నిర్వాహణ, ఉద్యోగాల భర్తీలో వైఫల్యం చెందడాన్ని నిరసిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా అఖిలపక్షం చేపట్టిన సడక్ బంద్‌లో భాగంగా అలంపూర్ లోని ఎన్‌హెచ్ 47 టోల్ ప్లాజా దగ్గర నిర్వహించిన సడక్ బంద్ వెళ్లే క్రమంలో ఆయనను ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. సంపత్ కుమార్ వెంట అలంపూర్ తాలూకాలోని అన్ని మండలాల అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.