విధాత: నమస్తే తెలంగాణ పత్రిక పూర్వపు ఎడిటర్, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి మాతృమూర్తి జానమ్మ (94) కన్నుమూశారు. ఈ రోజు ఉదయం తమ సొంత గ్రామం నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో వయో భారంతో కూడిన అనారోగ్య కారణాలతో ఆమె పరమపదించారు. కట్టా జానమ్మ సంతానం నలుగురు వజ్రమ్మ, సత్యనారాయణ రెడ్డి, శేఖర్‌రెడ్డి, లక్ష్మీలు కాగా శేఖర్‌రెడ్డి మూడవ సంతానం