Site icon vidhaatha

Formula E Race Scam : ప్రభుత్వానికి ఫార్ములా ఈ- కారు రేస్ నివేదిక

Formula E car Case

విధాత, హైదరాబాద్ : ఫార్ములా ఈ- కారు రేస్ లో(Formula E Car Race) అవతవకలపై విచారణ పూర్తి చేసిన ఏసీబీ(ACB) మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. సుదీర్ఘంగాలంపాటి ఫార్ములా ఈ కారు కేసు విచారించిన ఏసీబీ..ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి చెల్లింపులకు కేబినెట్ అనుమతి ఉందా…చెల్లింపులు చట్టబద్ధంగా జరిగాయా లేదా అన్న అంశాలపై విచారణ చేసింది. కేబినెట్ ఆమోదం లేకుండా విదేశీ సంస్థలకు 54.88కోట్లు నిధుల చెల్లింపు జరిగిందని..ఇందుకు బాధ్యులు ఎవరన్న అభియోగాలపై ప్రధానంగా ఏసీబీ విచారించింది. అప్పటి హెచ్ఎండిఏ కార్యదర్శి ఐఏఎస్ అరవింద్ కుమార్ ను(IAS Arvind Kumar), ఆనాటి మంత్రి కేటీఆర్(KTR) ను, జీహెచ్ఎంసీ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి(BLN Reddy), కిరణ్(Kiran) లను, అలాగే ఫార్ములా ఈ కారు రేసు నిర్వహణ సంస్థల ప్రతినిధులను ఏసీబీ విచారించింది.

కేటీఆర్(KTR) ను రెండు సార్లు, అరవింద్ కుమార్(Arvind Kumar) ను మూడుసార్లు విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసింది. 2024డిసెంబర్ 19న గవర్నర్ అనుమతితో ఈ కేసు నమోదైంది. పీఎంఎల్ఏ యాక్ట్ కింద ఈడీ(ED) కూడా కేసు నమోదు చేసింది. ప్రభుత్వం అనుమతిస్తే కేటీఆర్ సహా నిందితులపై ఏసీబీ(ACB) చార్జిషీట్ చేసి..ప్రాసిక్యూషన్ చేయనుంది. అయితే ఏసీబీ నివేదికపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠగా మారింది.

Exit mobile version