జులై 7నుంచి బోనాలు మొదలు మంత్రి … కొండా సురేఖ వెల్లడి

లంగాణలో జులై 7 నుంచి బోనాల పండుగ మొదలుకానుందని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఆషాఢమాసంలో జరిగే బోనాల ఏర్పాట్ల పై శనివారం ప్రభుత్వం అధికారులతో సమన్వయ సమావేశం జూబ్లీహిల్స్ లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో నిర్వహించడం జరిగింది.

  • Publish Date - June 15, 2024 / 05:54 PM IST

విధాత, హైదరాబాద్‌ : తెలంగాణలో జులై 7 నుంచి బోనాల పండుగ మొదలుకానుందని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఆషాఢమాసంలో జరిగే బోనాల ఏర్పాట్ల పై శనివారం ప్రభుత్వం అధికారులతో సమన్వయ సమావేశం జూబ్లీహిల్స్ లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో నిర్వహించడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్య సభ సభ్యుడు అనిల్ కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ అధికారులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. బోనాల పండుగకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. హైదరాబాద్‌ మహానగరంలో ఆషాఢమాసం మొదటి ఆదివారం నుంచే బోనాల సంబరం మొదలుకానుంది. గోల్కొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజా కార్యక్రమాలు వేడుకగా నిర్వహిస్తారు. ఆ తర్వాత రెండో వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల వేడుక నిర్వహిస్తారు. తదుపరి వారం సికింద్రాబాద్‌ లాల్‌ దర్వాజ మహంకాళి ఆలయాల్లో బోనాల పండుగ సాగుతుంది. ప్రతి గురు, ఆదివారాలు నెల రోజుల పాటు హైదరాబాద్‌ నగరమంతట బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.

Latest News