పారిశుధ్య కార్మికురాలిపై ఎస్‌ఎఫ్ఏ వేధింపులు.. సస్పెండ్‌

గాజులరామారం సర్కిల్ సూరారంలో ఎస్ఎఫ్‌ఏగా విధులు నిర్వహిస్తున్న కిషన్ తనకింద పనిచేస్తున్న ఓ మహిళ కార్మికురాలను గత కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్న ఘటనలో అతడిని సస్పెండ్ చేసి విచారణ చేపట్టారు

  • Publish Date - May 23, 2024 / 12:39 PM IST

విధాత: గాజులరామారం సర్కిల్ సూరారంలో ఎస్ఎఫ్‌ఏగా విధులు నిర్వహిస్తున్న కిషన్ తనకింద పనిచేస్తున్న ఓ మహిళ కార్మికురాలను గత కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్న ఘటనలో అతడిని సస్పెండ్ చేసి విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారడంతో పాటు వారం రోజుల క్రితమే సదరు ఎస్ఎఫ్‌ఏపై ఫిర్యాదు రావడంతో బీసీ మల్లారెడ్డి అతనిని సస్పెండ్ చేసి విచారణ చేపట్టారు. లైంగిక నేరానికి పాల్పడిన కిషన్‌ను శాశ్వతంగా విధులనుంచి తొలగించేందుకు ఉన్నత అధికారులకు సిఫార్సు చేస్తానని మల్లారెడ్డి తెలిపారు. బాధితురాలిని బలవంతంగా లోబరుచుకుని వీడియోలు తీస్తూ కిషన్ ఆమెను కొంతకాలంగా వేధిస్తూ వస్తున్నాడు.

Latest News