విధాత, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ (Telangana cabinet) మంగళవారం భేటీ అయింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓఆర్ఆర్ ను ఆనకుని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీన ప్రతిపాదనకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో మూడో విద్యుత్ డిస్కం ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో మూడో విద్యుత్ డిస్కం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో థర్మల్ పవర్ ప్రాజెక్టు అనుమతించిన క్యాబినెట్.. 3 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ ను 3 సర్కిళ్లుగ విభజించి అండర్ గ్రౌండ్ కేబుల్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
