Site icon vidhaatha

న‌ల్ల‌గొండ మ‌హాత్మ గాంధీ యునివ‌ర్సిటీకి రానున్న గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

విధాత‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ త్వరలో నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ)లో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరణకు హాజరుకాన​ఉన్నారు. అక్టోబర్‌ 7వ తేదీన గవర్నర్‌ విగ్రహావిష్కరణ అనంతరం పలు అంశాలపై విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమై చర్చించనున్నారు. దీంతో బుధవారం కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, ఎస్పీ రంగనాథ్‌.. వీసీ గోపాల్‌రెడ్డితో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశం జరిగే హాల్‌, రక్తదాన శిబిరం ప్రాంతాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ నాగార్జునరెడ్డి, గోలి అమరేందర్‌రెడ్డి ఉన్నారు.

Exit mobile version