Site icon vidhaatha

BRS | కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ.. గవర్నర్ పిలుపు కోసం ప్రభుత్వం నిరీక్షణ

BRS |

విధాత : తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం రెండు రోజులుగా గవర్నర్‌ తమిళ సై పిలుపు కోసం ఎదురుచూపులు పడుతుంది. సీఎం కేసీఆర్‌కు, గవర్నర్‌కు మధ్య నెలకొన్న విబేధాల నేపధ్యంలో గవర్నర్‌ కేబినెట్‌ విస్తరణకు సకాలంలో సహకరిస్తారా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పట్నం మహేందర్‌ రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకునేందుకు కేబినెట్‌ విస్తరణ కోసం గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. నేడు బుధవారం సప్తమి ఉదయం 11.30గంటలకు కేబినెట్‌ విస్తరణ చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు.

అయితే పుదుచ్చేరి నుంచి మంగళవారం హైద్రాబాద్‌ వచ్చిన గవర్నర్‌ నుంచి కేబినెట్‌ విస్తరణకు అవసరమైన పిలుపు అందడంలో జాప్యం జరుగుతుండటం ప్రభుత్వాన్ని టెన్షన్‌కు గురి చేస్తుంది. మంగళవారం రాత్రికల్లా గవర్నర్‌ నుంచి సమాచారం అందవచ్చని ప్రభుత్వం ఎదురుచూస్తుంది.

సీఎం కేసీఆర్‌కు, గవర్నర్‌కు మధ్య సాగుతున్న ప్రచ్చన్న పోరు నేపధ్యంలో ఆర్టీసీ విలీన బిల్లు, ఇతర పెండింగ్‌ బిల్లుల తరహాలోనే కేబినెట్‌ విస్తరణ ప్రక్రియపై కూడా ఉత్కంఠత కొనసాగుతుంది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల పేర్ల ఆమోదంపై కూడా గవర్నర్‌ సాచివేత వైఖరినే అనుసరిస్తున్నారు. ఈ నేపధ్యంలో కేబినెట్‌ విస్తరణ ప్రక్రియపై గవర్నర్‌ నుంచి పిలుపు కోసం ప్రభుత్వానికి నిరీక్షణ తప్పడం లేదు.

Exit mobile version