GPOలు ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలి : TEJAC చైర్మన్ వి.లచ్చిరెడ్డి

గ్రామ పాలన అధికారులు ప్రజా ప్రభుత్వం ఆశయాన్ని నెరవేర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ( TEJAC)చైర్మన్ వి.లచ్చిరెడ్డి సూచించారు.

విధాత, హైదరాబాద్ : 
గ్రామ పాలన అధికారులు ప్రజా ప్రభుత్వం ఆశయాన్ని నెరవేర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ( TEJAC)చైర్మన్ వి.లచ్చిరెడ్డి సూచించారు. గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తేనే క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం భావిస్తుందన్నారు. గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ (జీపీవోఓఏటీజీ) ఆవిర్భావ సభలో  ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జీపీవోల సమస్యలను పరిష్కరించే బాధ్యత గ్రామపాలన ఆఫీసర్స్ అసోసియేషన్  తీసుకుంటుందన్నారు. రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం అవుతున్న పరిస్థితి నుంచి ప్రభుత్వ సహకారంతో రెవెన్యూ వ్యవస్థను గ్రామగ్రామాన పునర్నిర్మాణం చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగస్థులకు మేలు జరగాలంటే సంఘం నాయకుడి పాత్ర అత్యంత కీలకం అని టీఈజేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. నాయకులకు పోరాట పటిమ ఉండాలని సూచించారు. గతంలో రెవెన్యూ వ్యవస్థ చెల్లాచెదురవ్వడానికి అనేక కారణాలు ఉండవచ్చు, కానీ ఇకముందు రెవెన్యూ వ్యవస్థను కాపాడుకునేందుకు మనందరం సంఘటితం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఐక్యంగా ఉంటేనే సమస్యల పరిష్కారం సాధ్యం అవుతుందన్నారు. మనందరం ఏకమై మన సమస్యలు పరిష్కరించుకుంటూనే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.
రెవెన్యూ శాఖలో నియామకమైన జీపీవోలు అంకిత భావంతో పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు. జీపీవోలపై ప్రభుత్వం పెట్టిన గురుతర బాధ్యతను అనునిత్యం గుర్తించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ రైతాంగానికి, ప్రజలకు మెరుగైన సేవలను క్షేత్రస్థాయిలనే అందించాలనే సంకల్పంతో పాటు గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం, పునర్నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  సంపూర్ణ సహకారం, భూ భారతి చట్టం అమలుతో జీపీవో వ్యవస్థ ఏర్పాటు సాధ్యమైందన్నారు. జీపీవోల సమస్యలను నాకు వదిలేసి ప్రజల సమస్యల పరిష్కారం బాధ్యత ను జీపీవోలు స్వీకరించాలన్నారు.
తెలంగాణలోని ప్రతి గ్రామాన్ని రెవెన్యూ, భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. జీపీవోలలో ఏ ఒక్కరూ తప్పు చేసినా మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు వస్తుందన్నారు. కారుణ్య నియామకాలకు సంబంధించి, 61 సంవత్సరాల బాధిత వీఆర్వోల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలన్నారు. ప్రజలకు మంచి సేవ చేస్తారని తాను భావిస్తున్నానని చెప్పారు. కింది స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు పదోన్నతులు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. నాడు రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వ్యక్తులే నేడు మళ్ళీ మన మధ్య తిరుగుతున్నారన్నారు. పదోన్నతుల విషయంలో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జీపీవో లు ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దని సూచించారు. దేశ భవిష్యత్తుకు యువత ఎంత కీలకమో, రెవెన్యూ వ్యవస్థకు జీపీవోలు అంతే కీలకమన్నారు. పోరాడి సాధించుకున్న ఉద్యోగంను ఒక యజ్ఞంగా భావించి ప్రజలకు నాణ్యమైన సేవలను సత్వరం అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీపీఓఏటీజీ సలహాదారులు, ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ కో-చైర్మన్, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.రామకృష్ణ, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రాములు, పాక రమేష్, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి వి.బిక్షం, టీజీఆర్ఎస్ఏ రాష్ట్రం కోశాధికారి మల్లేష్ సమక్షంలో లచ్చిరెడ్డి జీపీఓఏటీజీ రాష్ట్ర కమిటీ ని ప్రకటించారు.
జీపీఓఏటీజీ రాష్ట్ర నూత‌న‌ కార్య‌వ‌ర్గం.. అధ్యక్షుడిగా గరికె ఉపేంద్రరావు, మహిళా అధ్యక్షురాలుగా కంది శిరీషారెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా అర్జున్‌ మల్లారం, ఆర్‌. విజయ్‌కుమార్‌. కోశాధికారిగా ఇంజమూరి ఈశ్వర్‌. సెక్రెటరీ జనరల్ లుగా వి.లక్ష్మీ నర్సింహులు, దాసరి వీరన్న ఎన్నికయ్యారు.  కార్యవర్గానికి సంబంధించి వివరాలు..
అసోసియేట్‌ అధ్యక్షులు :
                                  ఏవీ జ్యోతిరెడ్డి, వ‌రంగ‌ల్‌
                                  కారుమూరి చంద్రయ్య, హైద్రాబాద్‌
                                  ముధుం చిరంజీవి, కామారెడ్డి
ఉపాధ్యక్షులు :
                       బచ్చలకూర పరమేష్‌, వనపర్తి
                        ప్రతిభ, మంచిర్యాల
                       ఎం.చంద్ర‌శేఖ‌ర్‌గౌడ్‌, నాగ‌ర్‌క‌ర్నూల్‌
                     లచ్చిమళ్ళ నర్సింహారావు, సూర్యాపేట
                     లక్ష్మీనారాయణ, సంగారెడ్డి
                     రాచకొండ నాగలక్ష్మి, ఖమ్మం
కార్యదర్శులు :
                       కోనబోయిన ప్రసాద్‌, భద్రాద్రి కొత్తగూడెం
                      బోళ్ళ శ్రీనివాస్‌, వరంగల్‌
                          బండి శ్రీ‌నివాస్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి
                     సునీత, ములుగు
                    నీరుడు మల్లీశ్వరి, సంగారెడ్డి
                     కోటేశ్వరరావు, ఖమ్మం
ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు :
                         ముత్యాలు, రంగారెడ్డి
                        చ‌ర్ల శ్రీనివాస్‌, ఖ‌మ్మం
                        పృథ్వి, నిజామాబాద్‌
                        పి. వరలక్ష్మి, భద్రాద్రి కొత్తగూడెం
                       కావలి వెంకటయ్య, వికారాబాద్‌
                       అశోక్‌, మహబూబాబాద్‌
సంయుక్త కార్యదర్శులు :
                     ఆత్రం అనసూర్య, ఆదిలాబాద్‌
                      మర్రి శంకర్‌ స్వామి, పెద్దపల్లి
                   సామా ప్రియాంకరెడ్డి, వరంగల్‌
                   కమలాకర్‌, సిద్దిపేట
                   సువార్త, జనగామ
                 కందుకూరి బాబూదేవ్‌, కరీంనగర్‌
                  బార్ల నాగేశ్వ‌ర‌రావు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం
కల్చరల్‌ కార్యదర్శులు :
                     క్రిష్ణయ్య, రంగారెడ్డి
                      రాజరత్నం, ఖమ్మం
స్పోర్ట్స్‌ కార్యదర్శులు :
                 రత్నాకర్‌, జగిత్యాల
                 మాన్‌సింగ్‌, జ‌న‌గాం
                  సత్యం, మేడ్చల్‌
                  గంగాధర్‌, నిర్మల్‌
కార్యవర్గ సభ్యులు :
           కొడికంటి వెంకన్న, సూర్యాపేట
           కొండ రాజేంద్రకుమార్‌, యాదాద్రి భువనగిరి
           వెంకటప్ప, నారాయణపేట్‌
              రవి, కామారెడ్డి
           కొమ్ము స్వప్న, వరంగల్‌
           అందె రవీందర్‌, కరీంనగర్‌
                వామన్‌ రావు, కొమరం భీం అసిఫాబాద్‌
           రవి, నల్లగొండ – మిర్యాలగూడ
           ఆనంద్‌, గద్వాల్‌
            స్రవంతి, మెదక్‌
          కె.హ‌రిసింగ్‌, జ‌గిత్యాల‌
           తొర్రెం శ్రీ‌నివాస‌రావు, ములుగు
         బిర్రు ఎల్ల‌న్న, వ‌రంగ‌ల్

Latest News