కర్రెగుట్టలో పథకం ప్రకారం గ్రేహౌండ్స్ దాడి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవ పోరాటాలపై కొనసాగిస్తున్న హత్యకాండను, నరహంతక దాడులను వ్యతిరేకించాలని భారత కమ్యూనిస్టు

  • Publish Date - April 13, 2024 / 11:08 PM IST

కత్తులతో పోడిచి, బండరాళ్ళతో హత్యచేశారు
ప్రభుత్వాల విప్లవ ప్రతిఘాతుక కాగార్ ఆపరేషన్
మృతులకు నివాళులు అర్పిస్తూ సంస్మరణ సభ
15న సీఆర్భీ బంద్ ను జయప్రదం చేయాలి
అప్రజాస్వామిక పాలన ప్రారంభించిన రేవంత్
మావోయిస్టు పార్టీ రాష్ట్ర ప్రతినిధి జగన్ ప్రకటన

విధాత ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవ పోరాటాలపై కొనసాగిస్తున్న హత్యకాండను, నరహంతక దాడులను వ్యతిరేకించాలని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు నిచ్చింది. శనివారం పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో విడుదలైన ప్రకటనలో ఈ మేరకు పిలుపునిచ్చారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పిట్టపడా వద్ద గ్రేహౌండ్స్ పోలీసులు చేసినా ఏక పక్ష దాడిని ఖండించండి. ప్రజాస్వామిక వాతవరణాన్ని నెలకొల్పే ఉద్యమాలను చేపట్టాలని కోరారు. జగన్ విడుదల చేసిన ప్రకటన ఈ కింది విధంగా ఉంది.

కూలీలను ఇన్ఫార్ములుగా మార్చి

ములుగు జిల్లా వెంకటాపూర్ (నూగూర్) మండలం, బీజాపూర్ జిల్లా బార్డర్లో తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు ఏప్రిల్ 24 తేదీన పిఎల్జీఏ బలగాలపై దాడి చేశాయి. ఎస్ఐబి పోలీసులు కూలీకి వెళ్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేసి మావోయిస్టుల సమాచారం చెప్పాలని ఎన్ కౌంటర్ చేస్తామని వేధించి ఇన్ ఫార్మర్లుగా మార్చుకొన్నారు. వేటగాళ్ళమాదిరిగా వారం రోజులు పిఎల్జీఏ కదలికలను పసిగట్టి దాడి పథకం రూపొందించారు.

తెలంగాణ గ్రేహౌండ్స్ దళాల దాడి

పథకం ప్రకారం ఏప్రిల్ 5వ తేదీన సాయంత్రం గ్రేహౌండ్స్ బలగాలు నూగూర్ వెంకటాపూర్ మండలం పరిధి నుండి అడవిలోకి ప్రవేశించి రాత్రికి రాత్రి పీఎల్జీఏ బలగాలున్న చోటుకు చేరుకుని 6వ తేదిన తెల్లవారు జామున 5.10 నిమిషాలకు చుట్టుమట్టి మూకుమ్మడి దాడి చేశాయి.

ముగ్గురు మృతి….కత్తులతో పొడిచి చంపారు

దాడిలో ముగ్గురు ప్రజావీరులు అమరులయ్యారు. మధ్య రీజనల్ కంపెనీ -2కి చెందని కమాండర్ అన్నె సంతోష్ (శ్రీధర్, సాగర్), ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యుడు కా. ఆప్కా మనీరామ్, పీఎల్జీఎ సభ్యుడు పూనెం లక్ష్మణ్ అమరులయ్యారు. పోలీసులు తమ కౄరత్వాన్ని ప్రదర్శించారు. గాయాలతో నిరాయుధంగా పడి వున్న ఆప్కా మనిరామ్ ను ప్రాణాలతో పట్టుకుని కత్తులతో పొడిచి చంపారు. పూనెం లక్ష్మణ్ శవంపై బండలతో దాడి చేసి తలను నుజ్జు, నుజ్జు చేసి మానవ మృగాలమని మళ్ళీ నిరుపించుకున్నారు. ఈ ఘటనకు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి.

అమరులైన ముగ్గురి వివరాలు

కామ్రేడ్ అన్నె సంతోష్ (శ్రీధర్, సాగర్) భూపాలపల్లి జిల్లా, కాటారం మండలం, అంకుశపురం గ్రామంలో జన్మించాడు. దున్నే వానికి భూమి నినాదంతో సాగుతున్న భ్యూస్వామ్య వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. 2000లో సిపిఐ (పీపుల్స్ వార్) పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా చేరారు. 24 సంవత్సరాల విప్లవ జీవితంలో ఆర్గనైజేషన్ లో రెండు సంవత్సరాలు పని చేసి ఆ తరువాత యాక్షన్ టీమ్, స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ దళంలో, ప్లటూన్, కంపెనీ వంటి మిలటరీ రంగా నిర్మాణాల్లో వివిధ స్థాయిల బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాడు. నిస్వార్ధంగా, రాజీలేని పోరాటం చేశాడు. కోరాపూట్, దామన్ జోడి, మురికినార్ పోలీసు స్టేషన్లపై చేసిన రెయిడ్స్, బీర గూడెం లాంటి
ఆంబూష్ ల వంటి అనేక గెరిల్లా యుద్ధ చర్యల్లో పాల్గొన్నారు.
కామ్రేడ్ అప్కామనీరామ్(ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యుడు). చత్తీష్ గడ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, బైరాన్ గడ్ బ్లాక్ లోని ఏటపాడు గ్రామస్తుడు. తను చిన్న తనం నుండి జనతన సర్కార్ ల నాయకత్వంలో విప్లవకర ప్రజా కార్యక్రమాలలో పాల్గొన్నాడు. 2012లో పూర్తి కాలం పిఎన్జీఏ సభ్యుడుగా చేరాడు. 2013లో కేంద్ర కమిటి నాయకత్వానికి గార్డుగా ఉక్కు క్రమశిక్షణతో బాధ్యతను 2018 వరకు నిర్వహించాడు. 2018లో మధ్య రీజినల్ కమాండ్ ప్రధాన బలగమైన కంపెనీ-2కి బదిలి అయ్యి తుది శ్వాస విడిచే వరకు అక్కడే పని చేశాడు. 2022లో ప్లటూన్ పార్టీ కమిటి సభ్యుడుగా ఎదిగాడు.
కా. పూనెం లక్ష్మణ్ చత్తీష్ గడ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా గంగులూర్ ఏరియాలోని పుంబాడ గ్రామంలో జన్మించాడు. పార్టీ 2022లో చేపట్టిన రిక్రూట్ క్యాంపెయిన్ లో పిఎల్జీఏలో భర్తి అయ్యాడు. 2022 నుండి సీఆర్సీ కంపెనీ-2లో పార్టీ సభ్యుడు కొనసాగుతున్నాడు.

అమరువీరుల సంస్మరణ సభ

ఎన్ కౌంటర్లో మృతి చెందిన కామ్రేడ్స్ సంస్మరణ సభను నిర్వహించుకున్నాయి. వినమ్రంగా విప్లవ జోహార్లు తెలుపుతూ శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

విప్లవ ప్రతిఘాతుక కాగార్ ఆపరేషన్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విప్లవోద్యమాన్ని నిర్మూలించేందుకు విప్లవ ప్రతిఘాతుక కాగార్ ఆపరేషన్ ను తీవ్రతరం చేశారు. రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే దాడులకు తెగబడుతుంది. అధికారం కోసం ఆరు గ్యారంటీలు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఏడో గ్యారంటని రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యవాదుల చర్చలో ప్రకటించాడు. ప్రజాస్వామ్యం, ప్రజాపాలన అంటూ నమ్మించి, ఇప్పుడు అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నాడు. సభలను అడ్డుకుంటూ పౌర హక్కులను కాలరాస్తున్నారు. తమ కొడుకుల జ్ఞాపకాలతో స్థూపాలను నిర్మించుకొంటుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు.
దేశంలో ఎన్డీఏ, ఇండియా కూటములు మద్య అధికారం కోసం పోట్లాటలున్నప్పటికీ మావోయిస్టు పార్టీని నిర్మూలించడం, సామ్రాజ్యవాదుల, ఘరాన కార్పోరేట్ల దోపిడికి కొమ్ము కాయడంలో బీజేపి, కాంగ్రెస్ లు మధ్య తేడా ఏమిలేదు. కేసిఆర్ నిరంకుశ పాలన పోవాలంటే నక్సలైట్లు రావాలని పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డికి, నరెంద్రమోడీని, ఆదానిని కలిసిన తరువాత నక్సలైట్లు తీవ్రవాదులుగా కనబడుతున్నారు. నరేంద్రమోడి, అమిత్ షాల నాయకత్వంలో కొనసాగిస్తున్న కౄరమైన విప్లవ ప్రతిఘాతుక కగార్ దాడిలో విప్లవకారులను హత మార్చడానికి దాడులకు పూనుకుంటున్నాడు.

15న సీఆర్భీ బంద్ ను జయప్రదం చేయండి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విప్లవకారులు, ప్రజాస్వామికవాదులపై సాగిస్తున్న దాడులను ఖండించండి. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రజాస్వామికవాదులు, మేధావులంతా కాంగ్రెస్ పార్టీని నిలదీయండి. ప్రభుత్వాలు తలపెడుతున్న కగార్ దాడిని నిరసిస్తూ 15వ తేదీన ఇచ్చిన సీఆర్భీ బందులో పాల్గొనాలని జగన్ ఆ ప్రకటనలో కోరారు.

Latest News