Assistant Public Prosecutor | హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్( Assistant Public Prosecutor ) పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ పరిధిలో ఖాళీగా ఉన్న 118 ఏపీపీ( APP )ల నియామకానికి అనుమతి తెలుపుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా( Sandeep Kumar Sultania ) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టుల భర్తీ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో జరగనుంది. మొత్తం 262 ఏపీపీ పోస్టులు ఖాళీగా ఉండగా, ప్రస్తుతం 118 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల నియామకానికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.
Assistant Public Prosecutor | 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
