విధాత: ఈటలపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈటల మాటలు హుజూరాబాద్ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు.ఈటల నా కుడి బుజం నా తమ్ముడు అని కేసీఆర్ అంటే..కేసీఆర్ కే గోరి కడతానని ఈటల అనడం ఏం సంస్కృతి అని మండిపడ్డారు.ఆయనకు అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి తెచ్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.మిగిలున్న రెండున్నరేళ్లు గెల్లు శ్రీనివస్ కి అవకాశం ఇవ్వండి అభివృద్ది అంటే ఏంటో చేసి చూపిస్తాం అని వ్యాఖ్యానించారు.