Site icon vidhaatha

హైదరాబాద్‌లో భారీ వర్షం..జలమయమైన రహదారులు

విధాత,హైదరాబాద్: జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, లక్డికాపూల్‌, నాంపల్లి, యూసుఫ్‌గూడ, శ్రీనగర్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కూకట్‌పల్లి, నిజాంపేట, కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. సికింద్రాబాద్‌ పరిధిలోని కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, చింతల్, సూరారం కాలనీలోనూ వర్షం కురిసింది.

భారీ వర్షంతో నగరంలోని రహదారులు చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పాతబస్తీ బహదూర్‌పురా వద్ద రహదారిపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మాదాపుర్ శిల్పారామం సమీపంలో ప్రధాన రహదారిపై భారీగా చేరిన వరద నీరడంతో పాటు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి.

Exit mobile version