Rain Alert | రానున్న 4 గంట‌ల్లో ఆయా జిల్లాల్లో కుండ‌పోత వ‌ర్షాలు..! జ‌ర జాగ్ర‌త్త‌..!

Rain Alert | రానున్న 3 - 4 గంట‌ల్లో తెలంగాణ‌( Telangana )లోని ప‌లు జిల్లాల్లో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు( Heavy Rains ) కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ వెద‌ర్ మ్యాన్( Telangana Weather Man ) బాలాజీ త‌న ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

  • Publish Date - September 25, 2025 / 08:25 AM IST

Rain Alert | హైద‌రాబాద్ : తెలంగాణ‌( Telangana )ను భారీ వ‌ర్షాలు( Heavy Rains ), వ‌ర‌ద‌లు ముంచెత్తుతూనే ఉన్నాయి. ఆయా జిల్లాల్లో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ కుండ‌పోత( Downpour ) వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు, చెరువులు పొంగి పొర్లుతుండ‌గా, నదులు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి.

ఇక రానున్న 3 – 4 గంట‌ల్లో తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ వెద‌ర్ మ్యాన్ బాలాజీ త‌న ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల‌, నిర్మ‌ల్, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, క‌రీంన‌గ‌ర్, సిరిసిల్ల‌, హ‌న్మ‌కొండ‌, కొత్త‌గూడెం, ఆదిలాబాద్ జిల్లాలో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో ఆయా జిల్లాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లోనే ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల‌ని సూచించారు.

ఇక హైద‌రాబాద్ న‌గ‌రంలో రాబోయే 5 గంట‌ల వ‌ర‌కు వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో చిరు జ‌ల్లులు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. సాయంత్రం, రాత్రి వేళ మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇక శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.