Site icon vidhaatha

ఖానామెట్‌లో భూ వేలంపై కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

విధాత‌:హైదరాబాద్ నగరంలోని ఖానామెట్‌లో భూ వేలంపై కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఖానామెట్‌లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశించింది….ఖనామెట్‌లో గొల్డెన్ మైల్‌లోని 15 ఎకరాలను ప్రభుత్వం వేలం వేసింది. కాగా 15 ఎకరాల్లో మూడెకరాల స్మశానం ఉంది. ఆ స్మశాన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెట్టింది. దీంతో స్మశానవాటిక వేళాన్ని ఆపాలంటూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. తమ పూర్వికుల సమాధులున్నాయని కోర్టుకు స్థానికులు నివేదించారు. తాము సెంటిమెంట్‌గా భావించే సమాధులను పరిరక్షించాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై విచారించిన హైకోర్టు తాత్కలికంగా స్మశాన వేలాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version