Site icon vidhaatha

ట్రాన్స్ ఫార్మర్ వద్ద పడిన షటిల్ కాక్..కరెంట్ షాక్ తో బాలుడు మృతి

hyderabad-boy-dies-electric-shock-transformer-shuttle

విధాత, హైదరాబాద్ : షటిల్ ఆడుతున్న ఓ బాలుడు తన అమాయకత్వంతో చేసిన పనికి విద్యుద్ఘాతానికి గురై మరణించిన విషాదకర ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కూకల్ పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని వసంత్ నగర్ లోని ఓ ఇంటి ఆవరణలో 14ఏళ్ల బాలుడు మిత్రులతో కలిసి షటిల్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో షటిల్ కాక్ పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ గోడపై పడింది. దానిని తన షటిల్ బ్యాట్ తో తీసేందుకు బాలుడు ప్రయత్నించాడు.

బ్యాట్ కరెంట్ వైర్లకు తగలడంతో విద్యుత్తు షాక్ కు గురై బాలుడు అక్కడికక్కడే కుప్ప కూలాడు. కుటుంబ సభ్యులు పరుగున వచ్చి ప్రాథమిక చికిత్స అందించే లోపే అతడు ప్రాణాలు విడిచాడు. బాలుడు మరణంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Exit mobile version