Site icon vidhaatha

Khammam | విద్యుదాఘతంతో.. నవోదయ విద్యార్ధి మృతి

Khammam |

విధాత, ఖమ్మం జిల్లాలో నవోదయ పాఠశాల విద్యార్ధి విద్యుత్తు షాక్‌తో దుర్మరణం పాలైన విషాధ ఘటన చోటుచేసుకుంది. పాలేరు నవోదయ పాఠశాలలో 12వ తరగతి చువుతున్న విద్యార్ధి దుర్గా నాగేందర్ పాఠశాలలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసే సమయంలో విద్యుత్తు షాక్‌కు గురై మృతి చెందాడు.

అతడితో పాటు విద్యుత్తు షాక్ గురైన ఇతర విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్ధి తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగగా, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రిన్సిపల్ పరారీలో ఉన్నాడు.

Exit mobile version