Drugs Racket| డాక్టర్ గారి డ్రగ్స్ దందా గుట్టు రట్టు !

అద్దె ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న ఓ డాక్టర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. డాక్టర్ జాన్ పాల్ ముషీరాబాద్ లో అద్దె ఇంట్లో ఉంటూ డ్రగ్స్ విక్రయిస్తున్నాడు.

విధాత, హైదరాబాద్ : అద్దె ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ దందా(Drugs Racket) నిర్వహిస్తున్న ఓ డాక్టర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. డాక్టర్ జాన్ పాల్(Doctor John Paul) ముషీరాబాద్ లో అద్దె ఇంట్లో ఉంటూ డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ప్రమోద్, సందీప్, శరత్ అనే ముగ్గురు స్నేహితులతో కలిసి ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకుని విక్రయించడం పనిగా పెట్టుకున్నాడు.

ఈ క్రమంలో అందిన సమాచారం మేరకు ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ బాలరాజు బృందంజాన్ పాల్ ఇంటిపై ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 26.95 గ్రాము ఓజీ కుష్, 6.21 గ్రాముల ఎండీఎంఏ, 15 ఎల్ఎస్‌డీ బ్లాట్స్, 1.32 గ్రాముల కొకైన్, 5.80 గ్రాముల గుమ్మస్, 0.008 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.3 లక్షల విలువ ఉంటుందని భావిస్తున్నారు
డాక్టర్ జాన్ పాల్ తో పాటు ముగ్గురు నిందితులు అరెస్ట్ చేశారు.

Latest News