Heat Wave | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మండుటెండలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరో వారం రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు మరి ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆదివారం పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా కుంచవెల్లిలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, హైదరాబాద్ నగరంలోని లంగర్‌హౌజ్‌లో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమీప జిల్లాల్లో కూడా తీవ్రమైన వేడిగాలులు కొనసాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ప్రజలు ఆగమాగం చేస్తున్నాయి.
తెలంగాణలో ఉష్ణోగ్రతల నమోదు ఇలా..
కుంచవెల్లి (ఆసిఫాబాద్) – 46.5
వెలగనూర్(మంచిర్యాల) – 46.4
అశ్వారావుపేట(కొత్తగూడెం) – 46.3
ఏటూరు నాగారం(ములుగు) – 46.3
ఏంకూరు(ఖమ్మం) – 46.3
మునుగోడు(నల్లగొండ) – 46.3
సర్వాయిపేట(భూపాలపల్లి) – 45.9
జీహెచ్ఎంసీ పరిధిలో ఇలా..
లంగర్‌హౌజ్ – 42.7
మారుతి నగర్(ఉప్పల్) – 42.4
