మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో మీ ప్రతిభ, కార్యదక్షతకు పురస్కారాలు, పదోన్నతులు పొందుతారు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే లాభాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సూచనలతో కీలక విషయాల్లో ముందంజ వేస్తారు.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈ రోజు మంగళకరమైన రోజు. వ్యాపారంలో బుద్ధి చాతుర్యంతో వ్యవహరిస్తే ఆశించిన లాభాలు పొందవచ్చు.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శ్రేష్టమైన శుభ సమయం నడుస్తోంది. మానసిక ఆనందం కలిగించే శుభవార్తలు వింటారు. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో లాభదాయకమైన పరిస్థితులు నెలకొంటాయి. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు అందుకుంటారు. వ్యాపారులకు లాభాలు గణనీయంగా పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో ఆచి తూచి నడుచుకోవాలి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. సమయ పాలన, ముందుచూపుతో వ్యవహరిస్తే శ్రమ, పనిఒత్తిడి తగ్గుతాయి. వ్యాపారంలో మీ శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ మీ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ఆర్థికాభివృద్ధికి మీరు చేసే కృషి ఫలిస్తుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఆనందాన్నిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికాభివృద్ధి స్పష్టంగా గోచరిస్తోంది. దృఢమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. కుటుంబంలో శుభకార్య సంబంధిత చర్చలు జరుగుతాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. శుభప్రదమైన కాలం నడుస్తోంది. మీ చుట్టూ అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం ఏదైనా విజయం మీదే! శుభవార్తలు విని ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. కీలక వ్యవహారాల్లో అధికారుల నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మీ కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గడం నిరాశ కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలహాలు అశాంతి కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతనతో మనశ్శాంతి పొందుతారు. వివేకంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో క్లిష్టమైన పనులు సులువుగా పూర్తి చేస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఘటనలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో శారీరక శ్రమ పెరిగినప్పటికీ పట్టుదలతో ముందుకెళ్లి విజయం సాధిస్తారు. కుటుంబ ఆస్తులు వృద్ధి చేస్తారు. కీలక విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోండి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి పరమైన శుభవార్తలు అందించిన ఉత్సాహంతో అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు ప్రోత్సాహాన్నిస్తాయి. గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి. బంధుమిత్రులతో విందువినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకూలత ఉంటుంది.
