కాళేశ్వరం పరిధిలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల గోదావరి నీటిని హైదరాబాద్ కు తరలించేలా పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.4 వేల 500 కోట్లతో వ్యయంతో 198 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మాణం కొనసాగుతుంది. కాంట్రాక్టు పనులు దక్కించుకున్న మేఘా సంస్థ పైప్ లైన్ నిర్మాణ పనులు నిర్వహిస్తుంది. మూసీ పునరుజ్జీవన పథకానికి మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్ కు వచ్చే గోదావరి నీళ్ల సరఫరా పథకం కీలకం కానుంది. ఈ పథకం పనులు రెండేళ్ల సమయంలో పూర్తి చేయాల్సి ఉండగా…18 నెలల్లోనే పూర్తి చేయాలని మెఘా సంస్థ పనులు కొనసాగిస్తుంది.
సిద్దిపేట జిల్లాలో 50టీఎంసీల నిర్మాణ సామర్ధ్యంతో మల్లన్న సాగర్ నిర్మించగా…ఇందులో 30 టీఎంసీలను సాగునీటి అవసరాలకు వినియోగించి, 20 టీఎంసీల నీటిని హైదరాబాద్ ప్రజల తాగునీటీ అవసరాల కోసం తరలిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కు కృష్ణా, మంజీరా పైప్ లైన్లతో నీటి సరఫరా సాగుతుంది. అలాగే ఇప్పటికే గోదావరి నుంచి రూ.3,375కోట్లతో 12ఏళ్ల క్రితం గోదావరి సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేశారు. ఈ పథకం కింద ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి ఏటా 10టీఎంసీల నీటి సరఫరా చేస్తున్నప్పటికి జంటనగరాల మంచినీటి అవసరాలు తీరడం లేదు.
దీంతో రాజధాని ప్రజల మంచినీటి అవసరాల కోసం మల్లన్న సాగర్ నుంచి రూ.4 వేల 500 కోట్లతో వ్యయంతో 198 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మాణం పథకం చేపట్టారు. ఎల్లంపల్లి నుంచి ప్రస్తుతం వస్తున్న పైప్ లైన్ కు సమాంతరంగా రెండు కొత్త పైప్ లైన్లు నిర్మిస్తున్నారు.
మల్లన్న సాగర్ నుంచి మేడ్చల్ జిల్లా ఘనపూర్ వరకు 100కిలో మీటర్ల మేరకు నాలుగు డయామీటర్ల పైప్ లైన్ నిర్మించి అక్కడ ప్రత్యేక వాటర్ ట్రీట్ మెంట్ ప్లాట్ నిర్మిస్తారు. 16 పంపులతో ఏసియాలోనే అతిపెద్దదైన 1170 ఎంఎల్డీ ట్రీట్ మెంట్ ప్లాంట్ నుంచి శుద్ది జరిగిన నీటికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు పంపిస్తారు. ఇందుకోసం అవుటర్ రింగ్ రోడ్డు వెంట రెండు పెద్ద పైప్ లైన్ల నిర్మాణం చేస్తున్నారు. మల్లన్న సాగర్ లో 5 టీఎంసీల డెడ్ స్టోరేజీ కెపాసిటీ ఉండటటంతో గ్రావీటి ద్వారా నీళ్లు తరలించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను హైబ్రిడ్ యాన్యూటీ పద్దతిలో చేపట్టాలని నిర్ణయించారు. మల్లన్న సాగర్‌లో ఒకవేళ నీటి మట్టాలు తగ్గితే పైనున్న కోండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సైతం నీటని వాడుకునే విధంగా మరో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇందుకు అనుగుణంగా బాహుబలి పంపులను వాడాలని నిర్ణయించారు. సింగూర్ నుంచి కూడా భవిష్యత్ లో నగరానికి నీటి సరఫరాలో అటంకం ఏర్పడితే మల్లన్నసాగర్ నుంచి ఇబ్బంది లేకుండా నీటీ సరఫరా కొనసాగించవచ్చు . సింగూర్ ప్రాజెక్టు మరమ్మతుల నేపథ్యంలో ఇక్కడి నుంచి ఏటా 7టీఎంసీలు నగరానికి ఆగిపోయే పరిస్థితి ఏర్పడనుందని…ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మల్లన్న సాగర్ నీటిని నగరానికి తరలించేందుకు ప్రభుత్వం పనుల వేగవంతం చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
Terrace Gardening | మీకు టెర్రస్ ఉందా..? సులభంగా ఈ 5 కూరగాయలు పండించండి మరి..!
Prabhas | ప్రభాస్ డ్రీమ్ ప్రాజెక్ట్.. హైదరాబాద్‌లో రూ.160 కోట్ల స్థలంలో అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్?
