Site icon vidhaatha

Hydra | హైడ్రా కూల్చి వేతలతో ఇతర అంశాలు సైడ్ అయ్యాయా?

హైడ్రా కూల్చి వేతలు, కొనసాగింపుపై ఒక వైపు సందేహాలు వ్యక్తం చేస్తున్న సామన్య ప్రజలు, మరో వైపు రుణమాఫీ ఇబ్బందులు, పెన్షన్లు, ఆరు గ్యారెంటీల అమలు, ఎమ్మెల్యేల జంపింగ్ లు, గ్రామ పంచాయతీ లతో పాటు వివిధ లోకల్ బాడీ ఎన్నికల అంశాలన్నీ విజయవంతంగా సైడ్ ట్రాక్ అయ్యాయని అంటున్నారు. గ్రామాల్లో కూడా రుణమాఫీ గురించి చర్చించడం లేదని, హైదరాబాద్ లో భవనాల కూల్చివేతలపైనే చర్చిస్తున్నారని కరీంనగర్ కు చెందిన శ్రీనివాస్ అన్నారు. ఎంఐ ఎం వాళ్ల బల్లింగ్ కూల్చే దమ్ము రేవంత్ కు ఉందా? లేదా? అనేదానిపై చౌరస్తాలో పంజాలు కాస్తున్నారని. నల్లగొండ జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ లో కూడా హైడ్రా స్థాయిలో నిడ్రా ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు హైదరాబాద్ కూల్చివేతలపైనే ప్రధానంగా చర్చిస్తుండడం గమనార్హం.
చెరువులు, కుంటలు, పూల తోటలతో నిండిన భాగ్యనగరంగా విలసిల్లిన హైదరాబాద్ మహా నగరం కాస్త రాజకీయ నాయకుల అవినీతి, అలసత్వంతో మురికి కూపంగా మారిందన్న విమర్శలు స ర్వత్రా వినిపిస్తున్నాయి. అనేక చెరువులు, కుంటలు కుచించుకు పోయాయి. పలు చెరువులు మాయం అయ్యాయి కూడా. దాదాపు 50 ఏళ్లుగా ఈ విధ్వంసం నారాటంకంగా కొనసాగుతూ వచ్చింది. అందుకే జూబ్లీహిల్స్ కు ఆనుకొని ఉన్న దుర్గం చెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో బడాబాబులే దాదాపు 250 కి పైగా నిర్మాణాలు చేపట్టారు. గత ప్రభుత్వం నిర్మించిన తీగల వంతెనకు ఆనుకొనే ఈ నిర్మాణాలుండడం గమనార్హం. హైదరాబాద్ ప్రజల దాహర్తిని తీర్చే గండిపేట, హిమాయత్ సాగర్ జలాశాయాల ఎఫ్ టీఎల్ పరిధిలో, బఫర్ జోన్ పరిధిలోనే భారీ నిర్మాణాలు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. పైగా చెరువులలో నిర్మించిన ఇండ్లు, అపార్ట్ మెంట్లకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం, వాటి ఆధారంగా బ్యాంకులు రుణలు ఇచ్చారు.

బ్యాంకులు రుణాలు తీసుకున్న సగటు వేతన జీవులు తమ ఇండ్లను చెప్పా పెట్టకుండా హైడ్రా అధికారులు కూల్చి వేస్తుండడంతో తమ సొంతింటి కల తమ కళ్ల ముందే చెదిరి పోయిందని, పైగా బ్యాంకు అప్పులు తమ మెడకు పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ ఎంసీ ఇచ్చిన అనుమతులు చూసే తాము కొనుగోలు చేశామని, తమకు ప్రభుత్వమే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే హైదరాబాద్ లో హైడ్రా చేపడుతున్న కూల్చి వేతలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చాలా బాగా చేస్తున్నాడని కితాబు ఇచ్చారు. ఇదే తీరుగా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు భూ ఆక్రమలపై చర్యలు తీసుకోవాలని చెప్పడం కొసమెరుపు

Exit mobile version