150పైకి దేశ, విదేశీ కంపనీల యంత్ర పరికరాల ప్రదర్శన
వ్యవసాయ అనుబంధ రంగాల స్టాల్స్ ఏర్పాటు
50వేల మంది ఔత్సాహిక రైతులకు ఎంట్రీ పాస్‌లు
రైతు బడి ఎండీ జూలకంటి రాజేందర్‌రెడ్డి వెల్లడి
విధాత, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్‌ను నిర్వహించబోతున్నట్లుగా రైతుబడి ఎండీ జూలకంటి రాజేందర్‌రెడ్డి వెల్లడించారు. రైతుబడి అగ్రి షో పేరుతో మొదటి అతిపెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్‌ను ఈ నెల 17,18తేదీల్లో నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో నిర్వహించనున్నట్లుగా రాజేందర్‌రెడ్డి వెల్లడించారు. 150కి పైగా దేశ, విదేశీ కంపనీలు పాల్గొంటున్నాయని, వ్యవసాయంలో వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు, యంత్రాలను ప్రదర్శనకు ఉంచబోతున్నట్లుగా తెలిపారు. ఫర్టిలైజర్స్, సీడ్స్, నర్సరీ, డ్రిప్, స్పీంక్లర్ల కంపనీలు, ఉద్యానవన కంపనీలు, వ్యవసాయ అనుబంధ రంగాలైన డెయిరీ, ఆక్వా, ఫౌల్ట్రీ కంపనీలు కూడా ప్రదర్శనలో తమ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయన్నారు. ఉమ్మడి నల్లగొండ నుంచి 50వేల మంది ఔత్సాహిక రైతులకు ఎంట్రీ పాసులు అందించే ప్రయత్నం చేస్తున్నామని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఇతర వివరాల కోసం rbagrishow.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు. వెబ్‌సైట్ ద్వారా ఎంట్రీ పాస్‌లు, స్టాల్స్‌ను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. నెంబర్‌వన్ వ్యవసాయ డిజిటల్ మీడియాగా పేరోందిన రైతుబడి చానల్‌కు వివిధ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో వంద కోట్ల మంది వరకు వ్యూవర్స్ ఉండటం గమనార్హం. రైతుబడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వ్యవసాయ ఎగ్జిబిషన్ పట్ల ఔత్సాహిక రైతుల్లో ఆసక్తి వ్యక్తమవుతుండటం విశేషం.