– బిజినెస్ సమ్మిట్లో పాల్గొన్న పారిశ్రామిక వేత్త గుంటి శ్రీధర్ రావు
– వరంగల్‌కు పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: దావోస్ సమ్మిట్‌తో వరంగల్‌కు పరిశ్రమలు రానున్నాయని ఆశిస్తున్నారు. ఈ దిశగా బిజినెస్ సమ్మిట్లో చర్చలు సాగుతున్నట్లు సమాచారం. వరంగల్‌కు చెందిన పారిశ్రామిక వేత్త గుంటి శ్రీధర్ రావు తన జన్మ స్థలానికి పరిశ్రమలు తీసుకొచ్చే దిశలో దావోస్ బిజినెస్ మీట్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నెంబర్ 1 గా పిలిచే గుంటి శ్రీధర్ కృషితో త్వరలో వరంగల్ కు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రానున్నట్లు చెబుతున్నారు. ఈ కార్యాచరణ అమలైతే వరంగల్ కొత్త కొలువులతో కళకళలాడుతుందా అంటే అవునని చెబుతున్నారు. దావోస్ బిజినెస్ మీట్లో పాల్గొన్న వరంగల్ కు చెందిన గుంటి శ్రీధర్ రావుకు కర్ణాటకతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో టెలి కమ్యూనికేషన్ పరిశ్రమలు ఉన్నాయి.
తన పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలన్న మమకారంతో దావోస్ లో జరుగుతున్న బిజినెస్ సమ్మిట్ లో పాల్గొన్నారు.. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాల్గొన్నారు. శ్రీధర్ రావుతో పలు సెల్ కంపెనీలకు చెందిన ప్రముఖులతో ఆయన హిస్టారికల్ సిటీ వరంగల్ గురించి చెబుతూ పరిశ్రమలు తీసుకువచ్చే దిశలో చర్చలు జరుపుతున్నారు. ఇది సక్సెస్ అయితే త్వరలో వరంగల్ కు జాతీయ అంతర్జాతీయ సంస్థలు రానున్నాయి. దీంతో ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయని ఆశిస్తున్నారు.