ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా

విధాత:మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్న ఈటల ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. శామీర్‌పేటలోని తన ఇంటి వద్ద నుండి అనుచరులతో బయలుదేరిన బయలుదేరిన ఈటల తొలుత గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం శాసనసభాపతి కార్యాలయంలో స్పీకర్ ఫార్మట్ లో రాజీనామా పత్రాన్ని అందించారు. భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో […]

  • Publish Date - June 12, 2021 / 06:33 AM IST

విధాత:మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్న ఈటల ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

శామీర్‌పేటలోని తన ఇంటి వద్ద నుండి అనుచరులతో బయలుదేరిన బయలుదేరిన ఈటల తొలుత గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం శాసనసభాపతి కార్యాలయంలో స్పీకర్ ఫార్మట్ లో రాజీనామా పత్రాన్ని అందించారు.

భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో కేసిఆర్ సర్కార్ ఈటలను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే ఈటల ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలను కలిసి వచ్చారు.