ఈటలకు జగదీష్‌రెడ్డి కౌంటర్
విధాత,హైదరాబాద్: మాజీ మంత్రి ఈటలపై విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. హుజురాబాద్ నియోజకవర్గానికి ఈటల ఏం చేశారని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ ను వీడిన వాళ్లే నష్టపోతారన్నారు. పార్టీకి ఎలాంటి నష్టం జరగదని జగదీశ్ రెడ్డి తెలిపారు. బీజేపీతో పాటు ఈటల కూడా మునిగిపోతారని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ను విమర్శించే హక్కు ఈటలకు లేదన్నారు. బీజేపీలో ఈటలకు ఏం కనిపిందోనని ఎద్దేవా చేశారు.
‘‘ప్రత్యేక ఎజెండాతోనే ఈటల బీజేపీలో చేరారు. రాజకీయాల్లో విభేదాలు రావడం సహజం. హిట్లర్ వారసుల వద్దకు చేరి నియంతృత్వం మీద పోరాడుతాననడం నేతి బీరలో నెయ్యి వెతికినట్లే. ఈటల మునిగిపోయే పడవ ఎక్కుతున్నారు. నియోజకవర్గ ప్రజల్ని ఈటల మోసం చేశారు. బీజేపీలో చేరడం వల్ల ప్రజలకు ఎలా న్యాయం చేస్తాడు?.’’ అని జగదీశ్ రెడ్డి విమర్శించారు.