ఎవరు పార్టీలో చేరినా చేర్చుకోండి.. తోపులెవ‌రూ లేరిక్క‌డ‌: జగ్గా రెడ్డి

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నష్టం చేసినవాళ్ళు అయినా స‌రే పార్టీలోకి చేర్చుకోవాల‌ని ఏఐసీసీ నిర్ణ‌యించిన‌ట్లు టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గా రెడ్డి తెలిపారు

  • Publish Date - April 25, 2024 / 04:50 PM IST

శ‌తృవు అయిన స‌రే క‌లిసి ప‌ని చేయాలి

విధాత‌: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నష్టం చేసినవాళ్ళు అయినా స‌రే పార్టీలోకి చేర్చుకోవాల‌ని ఏఐసీసీ నిర్ణ‌యించిన‌ట్లు టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గా రెడ్డి తెలిపారు. నాయ‌కులు నారాజ్ కాకుండా అంద‌రూ క‌లిసి ప‌నిచేయాలంటూ వెల్ల‌డించారు. నాకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళు వచ్చి చేరినా నేను అభ్యంత‌రం చెప్పను, ఏఐసీసీ కంటే ఇక్కడ తోపులు ఎవరూ లేరన్నారు. చేరిక‌ల క‌మిటీ చైర్మెన్ కోదండ రెడ్డి, జ‌గ్గారెడ్డిల స‌మ‌క్షంలో భారీగా చేరిక‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా జ‌గ్గారెడ్డి, మాట్లాడుతూ.. ఏఐసీసీ ఆదేశాల మేరకే చేరికలు జ‌రుగుతున్నాయ‌న్నారు.

ఎన్నికల వరకు పార్టీలో పని చేసి ఎన్నికల సమయంలో కొందరు బయటకు వెళ్లారని, వాళ్ళందరి విషయంలో పార్టీ తిరిగి చేర్చుకోవాలని ఏఐసీసీ పీసీసీకి ఆదేశించిందన్నారు. బీఆరెస్ నుంచి ఎవ‌రు వ‌చ్చినా చేర్చుకోవాల‌ని ఆదేశాలు ఉన్నాయ‌న్నారు. కండీష‌న్‌ల‌తో చేరిక‌లు ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీలో చేరినా.. వాళ్ళు కాంగ్రెస్ ఇంఛార్జి లు, ఎమ్మెల్యే ల కిందనే పని చేయాలని పార్టీ ఆదేశించింద‌న్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరే వాళ్లంతా డిక్లరేషన్ ఇవ్వాలి ,జవాబుదారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఓడిపోయినా వారు నారాజ్ అవ్వ‌కూడ‌ద‌న్నారు. మీడియాకు ఎక్కొద్ద‌ని అధిష్టానం ఆదేశించింద‌న్నారు.

కోదండ రెడ్డి, చేరికల కమిటీ చైర్మెన్‌.. కాంగ్రెస్‌కి నిర్దిష్ట సిద్ధాంతం..నియమాలు ఉన్నాయి , ప్రాంతీయ పార్టీలకు అవకాశవాదమే ఎజెండా అద్వానీ..మోదీ వేరు వెరూ పద్దతిలో విధ్వంసం చేశారని, మతాల మధ్య చిచ్చు పెట్టారన్నారు. బీజేపీ కూడా రూపాంతరం చెందిన పార్టీనే అని వెల్ల‌డించారు.

Latest News