బీఆర్ఎస్, బీజేపీలను బొందపెట్టడమే లక్ష్యం

బీఆర్ఎస్, బీజేపీలను బొందపెట్టడమే ధ్యేయంగా రెండు పార్టీలకు డిపాజిట్ రాకుండా చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియంకావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని పరకాల శాసన సభ్యులు, వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి

  • Publish Date - April 14, 2024 / 07:36 PM IST

పార్లమెంటు ఎన్నికల్లో డిపాజిట్లు రావద్దు
కడియం కావ్య గెలుపే లక్ష్యంగా కృషి

వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్, ఎమ్మెల్యే రేవూరి

విధాత, వరంగల్ ప్రతినిధి: బీఆర్ఎస్, బీజేపీలను బొందపెట్టడమే ధ్యేయంగా రెండు పార్టీలకు డిపాజిట్ రాకుండా చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియంకావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని పరకాల శాసన సభ్యులు, వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి రేవూరి ప్రకాశ్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ సన్నాహక సమావేశం ఆదివారం జరిగింది ఈ సమావేశంలో రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి బూత్ కమిటీ సభ్యుడు సైనికుడిగా పని చేయాలన్నారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం ఉంటుందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల, పాంచ్ న్యాయ్ హామీలను ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. గత10 సంవత్సరాలుగా పార్టీ జెండా మోసిన ప్రతీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు. పార్టీకి కార్యకర్తలే పునాదులని కార్యకర్తలను విస్మరిస్తే నాయకులే కాదన్నారు. అభివృద్ధి చేయాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలువాలని, వారి ద్వారా కేంద్రం నుండి నిధులు వస్తాయని అన్నారు.

– రాహుల్ ది త్యాగాల కుటుంబం

త్యాగాల కుటుంబం రాహుల్ కుటుంబం అని రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రి చెయ్యడమే మన లక్ష్యమని గుర్తు చేశారు. మోడీ కి కార్పొరేట్ కంపెనీల మీద ఉన్న ప్రేమ దేశ ప్రజల మీద లేదని విమర్శించారు. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తే మేలు జరుగుతుందని అన్నారు. గతంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, భూ పంపిణీ, ఉపాదిహామీ తదితర అనేక ఫలాలను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పారు.

– రైతుల సంక్షేమం పట్టించుకోని మోడీ

రైతుల సంక్షేమాన్ని మరిచి కార్పొరేట్ సంస్థల కోసం బీజేపీ పనిచేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేసి, పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, యశస్విని రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్ వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి, మొలుగూరి బిక్షపతి, సౌజన్య తదితరులు మాట్లాడారు.

Latest News