హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విధాత): హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ ఏడాది చివరిలో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నది. ఈ ఎన్నికలో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసి కవిత కొత్తగా రాజకీయ ఆరంగేట్రం చేస్తారా? అనే చర్చ నడుస్తున్నది. స్వయంగా పోటీ చేస్తారా? లేక ఎవరినైనా తన పక్షాన నిలుపుతారా? అన్నది ఎన్నిక షెడ్యూలు ప్రకటించిన తరువాత స్పష్టమవుతుందని అంటున్నారు. ఇప్పటికే ఆమె రాజకీయ పార్టీ రిజిస్టర్ చేశారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నది. ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశాలు కొట్టిపారేయలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జూబ్లీహిల్స్ బరిలో కవిత?
