Site icon vidhaatha

Kamareddy | మందుబాబుల‌కు బార్లు.. డ‌బుల్ బెడ్రూమ్ ఇండ్లు: ష‌బ్బీర్ అలీ

Kamareddy

విధాత, కామారెడ్డి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాష్ట్రంలోని మందుబాబులకు బార్లుగా మారాయని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో నిరుపయోగంగా మారాయని వాటిని మందు ప్రియులు తమ అడ్డాలుగా మార్చుకున్నారని పేర్కొన్నారు.

కామారెడ్డి పట్టణ పరిధిలోని టేక్రియాల్ గ్రామ శివారులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మాజీ మంత్రి షబ్బీర్ అలీ బుధ‌వారం పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నాణ్యత లోపంతో నిర్మించడంతో డబుల్ బెడ్ రూమ్ ల వద్ద మాజీ మంత్రి షబ్బీర్ అలీ ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ డ‌బుల్ బెడ్రూమ్ ఇండ్ల కాంట్రాక్టర్లను జైల్లో పెట్టాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా నిజాం నవాబ్ 9 ఎకరాలలో ఇల్లు నిర్మించుకుంటే ఇప్పుడు కేసీఆర్ 14 ఎకరాలలో ఇల్లు నిర్మాణం చేపట్టిండని ఆరోపించారు. దళితున్ని సీఎం చేస్తానని సీఎం కేసీఆర్ మాట తప్పడన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని యువకులను మద్యానికి బానిసలు చేస్తున్నాడని ఆరోపించారు.

సీఎం కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ కేసులో చిక్కుకుందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేసిన సీఎం కేసీఆర్ ఎందుకు దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నాడని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చెసారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలతో బిఆర్ఎస్ పార్టీ ఇంటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.

Exit mobile version