Adilabad | ఈ నెలలోనే.. సామూహిక‌ గృహ ప్రవేశాలు: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Adilabad విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు పంపిణీ చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. నిర్మ‌ల్ మున్సిపాలిటీ ప‌రిధిలో బంగ‌ల్ పేట్, నాగ‌నాయి పేట‌లో గృహ ప్ర‌వేశాల‌కు సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించి ల‌బ్ధిదారుల‌తో ముచ్చ‌టించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లో స‌దుపాయాలు ఎలా ఉన్నాయి? […]

  • Publish Date - August 11, 2023 / 09:44 AM IST

Adilabad

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు పంపిణీ చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. నిర్మ‌ల్ మున్సిపాలిటీ ప‌రిధిలో బంగ‌ల్ పేట్, నాగ‌నాయి పేట‌లో గృహ ప్ర‌వేశాల‌కు సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించి ల‌బ్ధిదారుల‌తో ముచ్చ‌టించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లో స‌దుపాయాలు ఎలా ఉన్నాయి? స‌మ‌స్య‌లు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీశారు. అక్క‌డ‌క్క‌డ కొన్ని మ‌ర‌మ్మ‌త్తులు చేయాల్సి ఉంద‌ని , వాటిని వెంట‌నే పూర్తి చేయాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

ఆగ‌స్టు నెల‌లోనే సామూహిక గృహ ప్ర‌వేశాలు చేసేలా ఏర్పాట్లు చేయల‌ని అధికారులను ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వీటిని ప్రారంభించుకున్నామ‌ని, త్వ‌ర‌లోనే ల‌బ్ధిదారుల‌కు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అంద‌జేస్తామ‌ని తెలిపారు.

నిర్మ‌ల్ మున్సిపాలిటీ ప‌రిధిలోని నాగ‌నాయి పేట్ లో రూ.54.24 కోట్ల వ్య‌యంతో నిర్మించిన 1014 డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు, బంగ‌ల్ పేట్ (ఖురాన్ పేట్) లో రూ.23.86 కోట్ల వ్య‌యంతో నిర్మించిన 446 డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు (మొత్తం రూ. 78 కోట్ల వ్యయంతో నిర్మించిన‌ 1460 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు) గృహ ప్ర‌వేశాల‌కు సిద్దంగా ఉన్నాయ‌న్నారు. మంత్రి వెంట అధికారులు ,స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Latest News