Site icon vidhaatha

కవిత సస్పెన్షన్‌తో బీఆర్ఎస్ శ్రేణుల పోటాపోటీ నిరసనలు

kavitha-brs-suspension-cadre-protests

విధాత : మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao), మాజీ ఎంపీ సంతోష్ రావులపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చేసిన విమర్శల నేపథ్యంలో ఆమెను బీఆర్ఎస్(BRS) నుంచి సస్పెండ్ చేసిన వ్యవహారం ఆ పార్టీ శ్రేణుల్లో పోటాపోటీ నిరసనలను రాజేసింది. బీఆర్ఎస్ పార్టీలోని ఆమె మద్దతుదారులు, జాగృతి శ్రేణులు కవితకు మద్ధతుగా హరీష్ రావు, సంతోష్ రావు, జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసనలు సాగించారు. మరోవైపు హరీష్ రావు మద్దతుదారులు కవిత దిష్టిబొమ్మను దహనం చేసి నిరసనలు తెలిపారు.

జిల్లాల్లో కవిత, హరీష్ రావుల మద్దతుదారుల పోటాపోటీ నిరసనలతో కల్వకుంట్ల కుటుంబంలోని గొడవలు రచ్చ కెక్కినట్లయ్యింది. హుస్నాబాద్, జగిత్యాల, మెదక్, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ సహా పలు జిల్లాల్లో కవిత, హరీష్ రావు వర్గాలు పోటాపోటీగా నిరసనలు నిర్వహించాయి.

Exit mobile version