రేపు యాదాద్రిని ద‌ర్శించ‌నున్న కేసీఆర్

విధాత‌: రేపు (మంగళవారం, 19 అక్టోబర్) యాదాద్రి పర్యటనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉదయం 11.30 కు హైద్రాబాద్ నుండి బయలుదేర‌నున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్ణిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నీటిని మరోసారి సిఎం కెసిఆర్ పరిశీలించ‌నున్నారు. యాదాద్రి పునః ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించారు. యాదాద్రిలోనే ఆలయ పునః ప్రారంభం తేదీలను సిఎం కెసిఆర్ స్వయంగా ప్రకటిస్తారు. పునః ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను […]

  • Publish Date - October 18, 2021 / 09:05 AM IST

విధాత‌: రేపు (మంగళవారం, 19 అక్టోబర్) యాదాద్రి పర్యటనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉదయం 11.30 కు హైద్రాబాద్ నుండి బయలుదేర‌నున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్ణిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నీటిని మరోసారి సిఎం కెసిఆర్ పరిశీలించ‌నున్నారు. యాదాద్రి పునః ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించారు. యాదాద్రిలోనే ఆలయ పునః ప్రారంభం తేదీలను సిఎం కెసిఆర్ స్వయంగా ప్రకటిస్తారు. పునః ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా సిఎం కెసిఆర్ ప్రకటించనున్నారు.