Site icon vidhaatha

Komatireddy Rajgopal Reddy | ఏపీ ప్రజల నాడి అంతుపట్టడం లేదు.. తెలంగాణలో కాంగ్రెస్‌కే మెజార్టీ సీట్లు :కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

విధాత : ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం తన జన్మదినం సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రజల నాడి తమకు తొలిసారిగా అంతుబట్టడం లేదని, ఫలితాలపై ఉత్కంఠగా ఉందన్నారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా..? లేక వైసీపీకీ పట్టం కడతారోనన్న ఉత్కంఠ నెలకొందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్.. బీజేపీ మధ్య హోరా హోరీ పోరు జరిగిందన్నారు.

తెలంగాణలో బీజేపీ.. కాంగ్రెస్‌ల మధ్యనే ప్రధాన పోటీ సాగిందని, బీఆరెస్ రాష్ట్రంలో తుడుచుపెట్టుకపోయిందన్నారు. తెలంగాణ ఎంపీ సీటల్లో కాంగ్రెస్‌, బీజేపీలు సమాన సీట్లు గెలుచుకునే అవకాశమున్నప్పటికి, కాంగ్రెస్‌కు 10సీట్లు వస్తాయన్నారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ ఖచ్చితంగా గెలుస్తాడన్నారు. దేశంలో మొదట్లో బీజేపీ హావా కొనసాగగా..అటు తరువాత ఉత్తరాదిన కాంగ్రెస్, ఇండియా కూటమి బాగా పుంజుకుందన్నారు. దీంతో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడం కష్టంగా కనిపిస్తుందన్నారు.

Exit mobile version