విధాత: టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో ముచ్చటించారు.కరోనా వల్ల పార్టీ కార్యక్రమాలు కూడా స్తబ్దుగా మారాయి,వాక్సినేషన్ 93 శాతం పూర్తయ్యింది. కరోనా ప్రభావం తగ్గడం తో పార్టీ కార్యక్రమాల్లో జోరు పెంచాం అన్నారు.తొమ్మిది నెలల పాటు రకరకాల పార్టీ కార్యక్రమాలు ఉంటాయన్నారు.
పార్టీ అధ్యక్షుడి గా కెసీఆర్ ను ప్రతిపాదిస్తూ ఇప్పటికే పది సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి,పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఈ నెల 24 న తెలంగాణ భవన్ లో ఉంటుంది.25 న ప్లీనరీ hitex లో ఘనం గా నిర్వహిస్తున్నాం.27 న తెలంగాణ విజయ గర్జన సభ విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఉంటాయి.
వరంగల్ లో ఎన్నో సభలు పెట్టి విజయవంతం చేశాం,మాకు వరంగల్ కలిసొచ్చిన ప్రాంతం.తెలంగాణ విజయ గర్జన గొప్ప సభల్లో ఒకటిగా మిగిలి పోతుంది.ఆర్టీసీ బస్సు లను ఆరు వేల వరకు వినియోగిస్తున్నాం,గ్రామ పంచాయతి డివిజన్లు సహా మొత్తం 16 వేల యూనిట్ల నుంచి వాహనాల్లో సభకు జనం వస్తారు.నవంబర్ 15 న ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతుంది.. ఆరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరుతున్నానని వెల్లడించారు.
హుజురాబాద్ లో వంద శాతం విజయం సాధిస్తున్నాం.నాగార్జున సాగర్ లో జానా రెడ్డి నే ఓడించాం రాజేందర్ అంతకన్నా పెద్ద లీడరా..బీజేపీ ని ఈటెల ఈటెల బీజేపీ ని సొంతం చేసుకోవడం లేదు,జై ఈటెల అంటున్నరు తప్ప జై శ్రీరామ్ అని ఎందుకనడం లేదు.బీజేపీ అంటే ఓట్లు పడవనే ఈటెల ఆ పార్టీ పేరు ఎత్తడం లేదా అని పేర్కొన్నారు.