హోటల్స్.. రెస్టారెంట్లలో కేటీఆర్ ప్రచారం

- దమ్ముంటే అశోక్ నగర్లో వెళ్లాలంటూ కాంగ్రెస్ సవాల్
విధాత : ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ శనివారం హైదరాబాదులోని ఫేమస్ నీలోఫర్ కేఫ్‌కి వెళ్లి అక్కడ చాయ్ తాగి టిఫిన్ చేసి అక్కడే ఉన్న ప్రజలతో ముచ్చటించారు. సెల్ఫీలు దిగారు. అంతకుముందు పాతబస్తీలోని ఫేమస్ ఐస్ క్రీమ్ సెంటర్ మదీనాలోని షాదాబ్ రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నారు.
కాగా.. ఆయన ఇటు డిన్నర్ చేస్తు అక్కడికి వచ్చిన వారిని పలకరించారు. ఆయా ఫోటోలను కేటీఆర్ ట్వీట్టర్ల పోస్టు చేశారు. కౌంటర్‌గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేటీఆర్‌కు అశోక్ నగర్‌కి వెళ్లే దమ్ముందా అంటూ ట్వీట్ చేసి కేటీఆర్ కు ట్యాగ్ చేసింది. అశోక్ నగర్ లో నిరుద్యోగులు, కోచింగ్ సెంటర్ల ప్రాంతం కావడంతో కాంగ్రెస్ ఆ విధంగా ట్వీట్టర్లో సవాల్ చేసింది.